హైదరాబాద్: 28°C
క్రీడలు

198 పరుగులు చేస్తే.. సచిన్ సరసన కింగ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం వన్డేల్లో 14,802 పరుగులతో ఉన్న కోహ్లీ.. మరో 198 పరుగులు చేస్తే వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం సచిన్ టెండూల్కర్ (18,426 పరుగులు) మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు. దీంతో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.