హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం'

HYD: మంత్రి వాకటి శ్రీహరిపై జరుగుతున్న అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ముదిరాజ్ సమన్వయ కమిటీ తీవ్రంగా ఖండించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కమిటీ నేతలు మాట్లాడుతూ.. బీసీ నాయకుడైన శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ముదిరాజ్ సమాజం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సమస్యలుంటే ప్రభుత్వానికి విన్నవించుకోవాలన్నారు.