HYD: హైదరాబాద్ లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 2025–26 వార్షిక నివేదికను ఆవిష్కరించారు. బ్యాంక్ రూ.1,282.84 కోట్ల నికర లాభం సాధించడం అభినందించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, రైతు సంక్షేమంలో బ్యాంక్ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ కె. ప్రతాప్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వార్షిక నివేదిక ఆవిష్కరణ


