హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్రశాంత వాతావరణమే ధ్యేయం: ఎస్సై

GDWL: రాజోలిలో ప్రశాంత వాతావరణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై కిరణ్ కుమార్ సూచించారు. మండలానికి నూతన ఎస్సైగా వచ్చిన ఆయనను గురువారం అఖిలపక్ష కమిటీ సభ్యులు చేనేత శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ 24/7 అందుబాటులో ఉంటానని SI అన్నారు.