హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20ల్లో కీరన్ పొలార్డ్ సరికొత్త రికార్డ్

వెస్టిండీస్ విధ్వంసక వీరుడు కీరన్ పొలార్డ్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో 'MI న్యూయార్క్' తరఫున ఆడుతున్న పొలార్డ్.. 'వాషింగ్టన్ ఫ్రీడమ్'తో జరిగిన మ్యాచ్‌లో 8 సిక్సర్లు బాదాడు. దీంతో టీ20ల్లో 1000 సిక్సర్ల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. క్రిస్ గేల్ (1056 సిక్సర్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా పొలార్డ్ చరిత్ర సృష్టించాడు.