హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సుపై డ్రైవర్ పట్టు కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి


