హైదరాబాద్: 28°C
క్రీడలు

వెస్టిండీస్ బోర్డుకు రూ. 110 కోట్ల రుణం

ఐసీసీ వార్షిక సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 12.82 మిలియన్ల అమెరికన్ డాలర్లను (సుమారు రూ. 110 కోట్లు) వెస్టిండీస్ బోర్డుకు రుణంగా మంజూరు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అలాగే, ఈ సమావేశాల్లో మారిషస్‌ ఐసీసీలో 111వ సభ్య దేశంగా చేరింది.