హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభం

కర్నూలులోని యునైటెడ్ క్లబ్‌లో జిల్లాస్థాయి యోగా పోటీలను యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఛైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి ప్రారంభించారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి సహజ రక్షణ కవచమని ఆయన అన్నారు. రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. పోటీల్లో సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.