హైదరాబాద్: 28°C
క్రీడలు

వన్డేల్లో అగ్రస్థానానికి చేరువగా గిల్

శుభ్‌మన్ గిల్ వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానానికి చేరువయ్యాడు. ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్ తన రేటింగ్ పాయింట్లను 803కు పెంచుకున్నాడు. ప్రస్తుతం డారెల్ మిచెల్(NZ) 814 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌లో గిల్ రాణిస్తే టాప్ ప్లేస్‌కు చేరుకునే అవకాశం ఉంది.