భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో విభేదాలు బయటపడ్డాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఇద్దరూ కలిసి కొనసాగడం కష్టంగా మారింది. తనకు ప్రాధాన్యత లేకపోవడంతో డస్కటే తప్పుకోవాలని భావిస్తుండగా, దిలీప్ పనితీరుపై బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. ఇంగ్లండ్ వన్డే సిరీస్ ముగిశాక దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
క్రీడలు
కోచింగ్ స్టాఫ్‌లో వివాదం..!


