ASR: త్వరలోనే కొత్త పే రివిజన్ కమిషన్‌ను ప్రభుత్వం నియమిస్తుందని, దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు తెలిపారు. రెండు వారాల్లోగా కమిషన్ నియామకం పూర్తవుతుందన్నారు. బుధవారం కొయ్యూరు మండలంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆయన కేజీబీవీ విద్యాలయాన్ని సందర్శించారు.
వార్తలు
'త్వరలోనే కొత్త పే రివిజన్ కమిషన్'


