హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉప్పునీటితో గొంతునొప్పికి చెక్‌!

గొంతునొప్పి తగ్గించుకోవడానికి ఉప్పునీటి పుక్కిలింత అద్భుతమైన చికిత్స. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా ఉప్పు కలిపి, ఆ నీటిని నోట్లో పోసుకుని గొంతు వరకు తగిలేలా కొన్ని సెకన్ల పాటు పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇది గొంతులోని వాపును తగ్గించి, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మంట, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజూ 2-3 సార్లు ఇలా చేస్తే గొంతునొప్పి, ఇన్ఫెక్షన్లు దరిచేరవు.