హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కొన్ని చిట్కాలతో జలుబు, దగ్గుకు చెక్

జలుబు, దగ్గు బాధిస్తుంటే కొన్ని చిట్కాలు పాటిస్తే బెటర్. గోరువెచ్చని నీరు రోజంతా తాగుతుండాలి. అల్లం రసంలో కాస్త తేనె కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.వాము వేసి మరిగించిన నీటిని తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. వేడి నీటి ఆవిరి పట్టడం వల్ల శ్వాస సులభమవుతుంది. తగినంత నిద్ర, పోషకాహారం ముఖ్యం. సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలి.