హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మత్స్యేంద్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు

మత్స్యేంద్రాసనం ఒక ప్రముఖ యోగాసనం. ఇది వెన్నెముకను బాగా సాగదీస్తుంది. నరాలను టోన్ చేస్తుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పొట్టపై పడే ఒత్తిడి వల్ల జీర్ణవ్యవస్థ ఉత్తేజితమవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. కాలేయం, మూత్రపిండాలు వంటి అంతర్గత అవయవాలను మసాజ్ చేసి, శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఛాతీని విస్తరించడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడుతుంది.