హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

AP: తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఇవాళ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నారు. 62 అజెండా అంశాలపై చర్చించనున్నారు. ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం, కాంట్రాక్టు కార్మికులకు జీతాల చెల్లింపు విధానం, కుమారధార, పసుపుధార మధ్య డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణంపై, తాతయ్య గంగమ్మ ఆలయాల అభివృద్ధికి నిధుల జారీపై చర్చించే అవకాశం ఉంది.