హైదరాబాద్: 28°C
వార్తలు

'గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి'

ADB: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని న్యూ హనుమాన్ కాలనిలో రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను MLA అనిల్ జాదవ్ నిన్న పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. నాయకులు రవీందర్ రెడ్డి, సజన్, దేవేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.