హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విశాఖలో వైఎస్‌ జగన్‌ పర్యటన

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరుతారు. విశాఖలోని జబ్బార్‌ తోటలో బాధిత మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రమాదం నుంచి బయటపడిన కారి చిన్నాను పరామర్శించి ప్రమాదం వివరాలు తెలుసుకుంటారు. అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. రేపు ప.గో. జిల్లాలో ఆక్వా రైతులను జగన్ కలవనున్నారు.