హైదరాబాద్: 28°C
వార్తలు

పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలి: ఎమ్మెల్యే

KRNL: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రాలయం MLA బాలనాగిరెడ్డి ఇవాళ తెలిపారు. ఈ పరిస్థితుల్లో పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని ప్రభుత్వం సూచించడం సరైన విధానం కాదన్నారు. గతంలో మాదిరిగా పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరించి అన్నదాతలకు అండగా నిలవాలని కోరారు.