ఆరోగ్యకరమైన జీవనశైలికి పౌష్టికాహారం కీలకం. మధ్యాహ్న భోజనంలో కనీసం వారానికి మూడుసార్లు ఆకుకూరలు (పాలకూర, తోటకూర) ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండి, రక్తహీనతను తగ్గిస్తాయి. అంతేకాక కంటిచూపు మెరుగుపడటంలోనూ, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని పప్పు లేదా వేపుడు రూపంలో తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఆరోగ్యం
లంచ్‌లో ఆకుకూర తప్పనిసరి


