హైదరాబాద్: 28°C
క్రైమ్

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్ మీర్‌పేట్ పరిధిలోని నందనవనంలో గల ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.