హైదరాబాద్: 28°C
క్రైమ్

ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

పంజాబ్‌లోని అమృత్ సర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 30 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల గుండా డ్రోన్లు లేదా ఇతర మార్గాల ద్వారా ఈ డ్రగ్స్ భారత్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.