హైదరాబాద్: 28°C
వార్తలు

'చట్టం జోలికొస్తే ప్రతిఘటన తప్పదు'

ASR: అరకులో గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో 1/70 చట్టం పరిరక్షించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి సంఘాల నేతలు కోరారు. 1/70 చట్టం సవరణ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఆదివాసుల పక్షాన వెంటనే పిటిషన్ దాఖలు చేయాలన్నారు. చట్టంలో మార్పులు జరిగితే ఆదివాసులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.