హైదరాబాద్: 28°C
క్రైమ్

పాక్ కాల్పులు.. ఆరుగురు మృతి

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఆందోళనలు మరోసారి ఉధృతం అయ్యాయి. రావల్ కోట్ పరిధిలోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులపై పాకిస్తాన్ భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో నిరసనకారులను చెదరగొట్టే నెపంతో పాక్ సైనిక, పారామిలిటరీ దళాలు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.