హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాల నిర్వహణపై సమావేశం

RR: షాద్‌నగర్ పట్టణంలోని 6వ వార్డు సాయిబాబా కాలనీలో బోనాల మహోత్సవాల నిర్వహణపై కాలనీ అభివృద్ధి కమిటీ సన్నాహక సమావేశం నిర్వహించింది. ముఖ్య అతిథి కౌన్సిలర్ రాజు నాయక్, అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు. పండుగను ఘనంగా, ఐక్యతతో జరుపుకుందామని పిలుపునిచ్చారు. కాలనీ అభివృద్ధి, ఉత్సవాల ఏర్పాట్లపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.