హైదరాబాద్: 28°C
క్రైమ్

అక్రమాస్తులు.. HMDA చీఫ్ ఇంజనీర్ అరెస్ట్

TG: HMDA చీఫ్ ఇంజనీర్ రవీందర్‌ను ACB అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో HYD సహా 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రూ.9.24 కోట్ల అక్రమాస్తులు, 9 ఫ్లాట్లు, ఖాళీ స్థలాలు, 4 ఎకరాల భూమి గుర్తించారు. 1440 గ్రాముల బంగారం, 12.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. రూ.1.16 కోట్ల విలువైన నాలుగు వాహనాలు ఉన్నట్లు తేలింది.