హైదరాబాద్: 28°C
క్రీడలు

జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు శుభారంభం

జపాన్ ఓపెన్ (BWF సూపర్ 750) బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి నిరాశపరిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పీవీ సింధు 21-14, 21-11 తేడాతో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌పై వరుస గేమ్‌లలో అలవోకగా విజయం సాధించింది.