హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి వన్డేలో రోహిత్, కోహ్లీ ఫ్లాప్

ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో రోహిత్, కోహ్లీ ఘోరంగా నిరాశపరిచారు. 21 బంతులు ఎదుర్కొని 11 పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. సామ్ కరన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ 6 బంతుల్లో 5 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్‌లో LBWగా పెవిలియన్ చేరాడు. వీరిద్దరి బ్యాటింగ్‌ను చూడాలని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది.