హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ఫుట్‌బాల్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే సెమీఫైనల్‌తో పాటు, 20న జరిగే ఫైనల్ రోజున బెంగళూరులోని హోటళ్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి తర్వాత కూడా తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1 గంట తర్వాత ప్రారంభం కానున్నాయి. దీంతో అభిమానుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది.