అమెరికాలో జరుగుతున్న MLC టీ20 లీగ్‌లో పాక్ ఆటగాళ్లు పాల్గొనకుండా నిషేధించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరే దీనికి ప్రధాన కారణం. పాక్ ప్లేయర్లకు NOC జారీ చేయడానికి గానూ ఒక్కో ఆటగాడిపై ఫ్రాంచైజీల నుంచి 25,000 డాలర్ల ఫీజును PCB డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో, ఇకపై ఈ టోర్నీలో పాక్ ప్లేయర్లను నిషేధించాలని MLC నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.
క్రీడలు
పాకిస్తాన్ ప్లేయర్లపై నిషేధం..!


