ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డు సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో అతడు తన కెరీర్‌లో 200వ వన్డే మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. కాగా, మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 225 వన్డేలతో ఆ దేశం తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
క్రీడలు
జోస్ బట్లర్ సరికొత్త రికార్డ్


