హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని చాటుకున్న యువకుడు

NLG: నార్కట్‌పల్లికి చెందిన యువకుడు లింగం గౌడ్ తన తల్లిదండ్రులైన కొయ్యడ సాలమ్మ, కేశవులకు తొలిసారిగా విమాన ప్రయాణ భాగ్యం కల్పించారు. వారిని కాశీ విశ్వనాథ్ దర్శనానికి, అయోధ్య రామ మందిరానికి విమానంలో తీసుకెళ్లారు. కన్నవారిని ఇలా ఆధ్యాత్మిక యాత్రకు తీసుకెళ్లే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని, దీనితో తన జీవితం ధన్యమైందని ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.