హైదరాబాద్: 28°C
క్రైమ్

అధిక లాభాల పేరుతో రూ.21 కోట్లు టోకరా

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ చార్టర్డ్ అకౌంటెంట్(CA) ఏకంగా రూ.21 కోట్లు మోసపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. గ్వాలియర్‌కు చెందిన CAను ఓ మహిళ వాట్సప్ ద్వారా సంప్రదించి.. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పింది. అతడికి నమ్మకం కలిగేలా ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఆరు నెలల వ్యవధిలో రూ.21 కోట్లు టోకరా వేశారు.