AP: ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. గోపాల్‌నగర్‌లో క్షుద్రపూజల పేరుతో ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. అంగవైకల్యం ఉన్న బాలుడికి వైద్యం చేస్తానని ఓ మహిళ.. బాలుడిని కట్టేసి కొడుతూ ఉండేదని స్థానికులు చెబుతున్నారు. మహిళ పెట్టిన హింసకు బాలుడు మృతిచెందాడు. దీంతో బంధువులు మహిళపై దాడి చేశారు. బాలుడు చనిపోయిన తర్వాత కూడా తిరిగి బతికివస్తాడంటూ మృతదేహంతో పూజలు చేసినట్లు సమాచారం.
క్రైమ్
దారుణం.. పూజల పేరుతో బాలుడు మృతి


