హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదం.. హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

AP: కర్నూలులో రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న జాతీయ రహదారిపై హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి జాగింగ్ చేస్తుండగా ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వరప్రసాద్ రెడ్డి ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.