హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్

ASF: తిర్యాణి మండలం నాయకపుగూడ గ్రామంలోని పురాతన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకొని ప్రమాదంగా మారింది. గ్రామంలోని పెద్ది సుధాకర్ ఇంటి ఆవరణంలో ఉన్న ఈ ట్యాంక్ గోడలు పగుళ్లు బారాయి. పెచ్చులు ఊడి పడుతుండడంతో సమీపంలో అంగన్వాడి పాఠశాల ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కూల్చివేయాలని కోరారు.