BHPL: గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లెలో సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్యుల బృందం గ్రామస్తులకు రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేసింది. వర్షాకాల అంటువ్యాధుల నివారణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి శిబిరాలు కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.
వార్తలు
కొత్తపల్లెలో ఉచిత ఆరోగ్య శిబిరం


