హైదరాబాద్: 28°C
వ్యాపారం

నెల రోజుల గరిష్ఠానికి చమురు ధరలు

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర 2 శాతం కంటే ఎక్కువ పెరిగి నెల రోజుల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో ప్రస్తుతం బ్యారెల్ ధర 85 డాలర్లను దాటింది. ఇది ఇలాగే కొనసాగితే భారత్‌లో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు