హైదరాబాద్: 28°C
వార్తలు

యర్రగుంట్ల యువతికి RU పీహెచ్‌డీ ప్రధానం

NDL: సిరివెళ్ళ మండలం యర్రగుంట్లకు చెందిన కే.పద్మ ఆర్థికశాస్త్రంలో రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆంధ్రప్రదేశ్‌లో మానవ అభివృద్ధికి విద్యారంగ సహకారం అంశంపై ఆమె పరిశోధన పూర్తి చేశారు. ప్రొఫెసర్ నాయక్ పర్యవేక్షణలో సాగిన పరిశోధనకు వీవా-వోస్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈమేరకు విశ్వవిద్యాలయం సోమవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.