NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూలమాలలు వేసి అలంకరించారు. ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వార్తలు
చౌడేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు


