హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్ గెలుపు చిరస్మరణీయం: లోకేష్

లార్డ్స్‌లో జరిగిన మహిళల టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు గెలుపు చిరస్మరణీయమని ఏపీ మంత్రి లోకేష్ కొనియాడారు. ఇంగ్లండ్‌పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మహిళా జట్టుకు అభినందనలు తెలిపారు. కాగా, క్రికెట్ పుట్టిల్లు లార్డ్స్ మైదానంలో ఆల్‌రౌండ్ షోతో ఆతిథ్య జట్టును భారత్ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.