హైదరాబాద్: 28°C
క్రీడలు

జింబాబ్వే బౌలర్‌కు ఐసీసీ షాక్

టీమిండియాతో సిరీస్‌కు ముందు జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ తనాకా చివంగాను ICC మందలించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అతడు తన తోటి జట్టు సభ్యుడిని అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతడికి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.