హైదరాబాద్: 28°C
వార్తలు

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించం: DGP

HYD: మంచిరేవులలోని 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్' (VIPS) నిర్మాణ పనుల్లో ఆలస్యంపై డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, సాధారణ కుటుంబాల పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక పాఠశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.