హైదరాబాద్: 28°C
క్రీడలు

వాళ్లిద్దరూ 'టెర్మినేటర్స్': యూవీ

భారత యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, వైభవ్‌ సూర్యవంశీలను యువరాజ్ సింగ్ 'టెర్మినేటర్స్'తో పోల్చాడు. తనకంటే వారు నాలుగు రెట్లు దూకుడుగా ఆడుతారంటూ కితాబిచ్చాడు. తనను తాను టెర్మినేటర్‌గా భావిస్తే.. అభిషేక్ 'టెర్మినేటర్ 4' అని, వైభవ్ 'టెర్మినేటర్ 6' అని యువీ అన్నాడు. టెన్నిస్‌లో సినర్, అల్కరాజ్‌ల లాగే క్రికెట్‌లో వీరు గేమ్ ఛేంజర్స్ అని కొనియాడాడు.