హైదరాబాద్: 28°C
క్రీడలు

'రో-కో' ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీలు ఆడటం దాదాపు ఖాయమని అతడు స్పష్టం చేశాడు. గత దశాబ్ద కాలంగా 'రో-కో' టీమిండియాకు వెన్నెముకగా నిలిచారని పేర్కొన్నాడు. రాబోయే WC ప్రణాళికల గురించి ఇప్పటికే తాను కోహ్లీతో చర్చించినట్లు గిల్ వెల్లడించాడు.