వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ వన్డే రిటైర్మెంట్‌పై ఆ జట్టు హెడ్ కోచ్ డారెన్ సామీ స్పష్టత ఇచ్చాడు. హోల్డర్ వన్డేల నుంచి రిటైర్ అవ్వలేదని ఆయన స్పష్టం చేశాడు. గతంలో తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వాడిన తప్పుడు పదం వల్లే ఈ గందరగోళం నెలకొందని తెలిపాడు. అందుకు హోల్డర్‌కు, అభిమానులకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు.
క్రీడలు
హోల్డర్ వన్డే రిటైర్మెంట్‌పై క్లారిటీ


