హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి

ADB: బోథ్ మండలంలోని కరత్వాడ గ్రామ మహిళలు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను నేరడిగొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అర్హులైన తమకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు గ్రామ మహిళలు పేర్కొన్నారు.