హైదరాబాద్: 28°C
వార్తలు

సత్తెనపల్లిలో క్రీడాకారులకు అభినందనలు

PLD: సత్తెనపల్లి రఘురామ్ నగర్ ప్రజావేదికలో గుంటూరు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అండర్-17 విభాగంలో ద్వితీయ స్థానం సాధించిన అభిషేక్, తేజస్వినిలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.