AP: బాపట్ల జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. రేపల్లె మండలం పెనుమూడి చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మంచినీళ్ల కోసం బస్సు ఆపి డ్రైవర్ కిందకు దిగాడు. రోడ్డు వాలుగా ఉండటంతో బస్సు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
క్రైమ్
పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు


