హైదరాబాద్: 28°C
క్రీడలు

ధీరజ్‌ జోడీకి కాంస్యం చేజారె

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-4 టోర్నమెంట్లో ధీరజ్‌ బొమ్మదేవర, కీర్తి జంట కొద్దిలో కాంస్యం కోల్పోయింది. రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగం కాంస్య పతక పోరులో ధీరజ్‌ ద్వయం 3-5తో రాబర్టా ఫ్రాన్సెస్కో-మెటో బొర్సాని (ఇటలీ) జంట చేతిలో ఓడింది. ఈ పోరులో ఒక దశలో పైచేయి సాధించిన ధీరజ్‌ జోడీ.. ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేక పతకాన్ని చేజార్చుకుంది.