హైదరాబాద్: 28°C
క్రైమ్

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం

AP: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేణిగుంట-తిరుపతి మార్గంలోని రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ (సీఆర్ఎస్) స్క్రాప్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.